రాయల్ ఛాలెంజర్స్, బెంగుళూరు వంటి జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : క్రికెట్ లవర్స్ కు ఈ ఇయర్ మంచి బూస్టింగ్ ...మనోళ్లు మొన్నే ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొట్టారు. మళ్లీ మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 స్టార్ట్ అయిపోతుంది. ముంబై , చెన్నై లాంటి జట్లు ఇప్పటికే చాలా సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్, బెంగుళూరు వంటి జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు.
సారి అయినా తమ కలను నెరవేర్చుకోవాలని ఢిల్లీ, ఆర్‌సీబీ వంటి జట్లు భావిస్తుండగా.. మిగిలిన జట్లు కూడా ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరుగనుంది. మార్చి 22న కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఢిల్లి కెప్టెన్స్ తమ జట్టు కెప్టెన్ ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ను కెప్టెన్‌గా నియమించింది.
* ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్
* సన్‌రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్
* చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
* కోల్‌కతా నైట్‌రైడర్స్ – అజింక్యా రహానే
* లక్నో సూపర్ జెయింట్స్ – రిషబ్ పంత్
* పంజాబ్ కింగ్స్ – శ్రేయస్ అయ్యర్
* రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్
* ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్
* గుజరాత్ టైటాన్స్ – శుభ్‌మన్ గిల్