ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ నటిస్తున్న మూవీ జాక్ కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్ . బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూవీ టీం ప్రమోషన‌్స్ ను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి ఒక్కొ పాటను విడుదల చేస్తోంది. రీసెంట్ గా కిస్ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేసింది. ‘నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు.. చేస్తా ‘అని వైష్ణవి చైతన్య అడుగుతుంది. ప్రొమో మొత్తం డైలాగ్‌లే ఉన్నాయి. ఇది జస్ట్ కిస్ లిరికల్ సాంగ్ ను మార్చి 17 అంటే రేపు ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. ఈ మూవీ కి హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.