viral: ఏలియన్స్‌కి కూడా గుడి కట్టే వాళ్లు ఉన్నారంటే నమ్ముతారా ?

ప్రపంచాన్ని ఏలియన్స్ మాత్రమే రక్షించగలరని, సినిమాల్లో చూపించినట్లు మాత్రం ఏలియన్స్ ఉండరని అంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తం ఏలియన్స్ కు గుడి కట్టాడు.


Published Aug 03, 2024 06:09:00 PM
postImages/2024-08-03/1722689922_alianstemple.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత్ లో ఓ వ్యక్తి స్వయంగా ఏలియన్స్ తో మాట్లాడే వ్యక్తి ఉన్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు. అంతేకాదు ఈయన ఏలియన్స్ తో డైరక్ట్ గా మాట్లాడతాడని కూడా చెప్తున్నాడు. ప్రపంచాన్ని ఏలియన్స్ మాత్రమే రక్షించగలరని, సినిమాల్లో చూపించినట్లు మాత్రం ఏలియన్స్ ఉండరని అంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తం ఏలియన్స్ కు గుడి కట్టాడు.


తమిళనాడులోని సేలం జిల్లా మల్లమూపంబట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తి ఏలియన్స్‌ కనిపిస్తారట. మాట్లాడతారని కూడా చెప్తున్నాడు. అందుకే గుడి కట్టాడు...తనకున్న 3 ఎకరాల భూమిలో ఏలియన్స్ కోసం ప్రత్యేకంగా దేవాలయాన్నే నిర్మించాడు. ఈ గుడిని నిర్మించడానికి ఏకంగా ఏలియన్స్ పర్మిషన్‌ కూడా తీసుకున్నానని చెబుతున్నాడు లోగనాథన్. తాను నిర్మి్స్తున్న ఆలయంలో నేలకు 11 అడుగుల లోపల సెల్లార్‌లో శివుడు, పార్వతి, మురుగన్, కాళిమాత వంటి దేవతల విగ్రహాలతో పాటుగా ఏలియన్స్ ప్రతిమలను కూడా ప్రతిష్ఠించాడు.


సినిమాల్లో చూపించినట్లు ఏలియన్స్ అంటే వారికి కొమ్ములు ఉండవని స్పష్టం చేశాడు. ఏలియన్స్‌ను ప్రత్యేకంగా పూజించాలని అంటున్నాడు. ప్రకృతి వైపరిత్యాలను ఏలియన్స్ ఆపగలరని నమ్ముతున్నానన్నారు.ఏలియన్స్ నుంచి వచ్చే రేషియేషన్ నుంచి తప్పించుకోవడానికి శరీరానికి అరటి ఆకులు చుట్టుకోవాలని చెప్పారు. అయితే ఈ గుడి ఇంకా కన్సట్రక్షన్ లో ఉంది. దీన్ని చూడడానికి జనాలు ఫుల్ ఎగబడుతున్నారంటే నమ్మండి. ఇప్పుడు ఈ గుడి ఫుల్ వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu temple tamilanadu

Related Articles