సోమవారం ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: సోమవారం ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026 మార్చి తర్వాత జీఎస్టీ సెస్ కొనసాగింపుపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించే అంశంపై జీవోఎం ఏర్పాటు చేసింది. కాగా, దీనిపై అక్టోబర్ నెలాఖరు నాటికి జీవోఎం నివేదిక ఇవ్వనుంది. ఈ జీవోఎం నివేదికపై నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునున్నారు.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాతో వెల్లడించారు. క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు తెలిపారు. వాణిజ్య ఆస్తులను అద్దెకు ఇవ్వడం రివర్స్ ఛార్జ్ మెకానిజం కిందకు తీసుకువస్తామని చెప్పారు. క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించామని.. దాంతో ఖర్చును మరింత తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.