ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
న్యూస్ లైన్ డెస్క్: ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులతో డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే నూతన సాంకేతికతను వాడుకోవాలని అధికారులను ఆదేశించారు. సిటీ అభివృద్ధికి కావాల్సిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియను వేగం చేయాలన్నారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఔషధ తయారీ కంపెనీలు, బయోటెక్ & లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్‌గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.