రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి సైజెన్ గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి సైజెన్ గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది. గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితుల కోసం తమవంతు సహాయంగా ముందుకొచ్చినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారిని అభినందించారు.
ఇక వరద బాధితుల సహాయార్థం తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తరఫున 50 లక్షల విరాళం అందించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఆ మొత్తానికి చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. అలాగే హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (టీజీసీవో), తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీహెచ్‌డీసీ) ఉద్యోగులు తమ వంతుగా ఒక రోజు వేతనం 4.31 లక్షల రూపాయల విరాళం ప్రకటించి ఆమేరకు చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు వారిని ముఖ్యమంత్రి అభినందించారు.