Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మ్యాడ్‌నెస్ వచ్చేస్తుంది

ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం 5:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మూవీయూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.


Published Sep 09, 2024 09:54:08 PM
postImages/2024-09-09/1725899048_devara3.PNG

న్యూస్ లైన్ సినిమా: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘‘దేవర’’. ఈ మూవీకి కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందు రానుంది. అయితే ఫస్ట్ పార్ట్ 2024 అక్టోబ‌ర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌కు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్‌డేట్ అందించారు.

ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం 5:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మూవీయూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ మొండి కత్తి పట్టుకున్న స్టిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles