narendra modi: భారత్ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది !

త్రివిధదళాలు అధిపతులు , డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయిన అనంతరం చాలా మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు


Published May 09, 2025 11:34:00 AM
postImages/2025-05-09/1746770751_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు మిస్సైల్స్, రాకెట్స్ తో పాకిస్థాన్ దాడులకు పాల్పడగా అంతే ధీటుగా బదులిచ్చింది భారత్ . ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. త్రివిధదళాలు అధిపతులు , డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశం అయిన అనంతరం చాలా మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రతా, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు , కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు ప్రధాని మోదీ.


సివిల్ డిఫెన్స్ యంత్రాంగాలను బలోపేతం చేయడం తప్పుడు వార్తలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టడం కీలకమైన మౌలిక సౌకర్యాల భద్రత కల్పించే విధంగా చూడడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. క్షేత్ర స్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. పహాల్గామ్ ఉగ్రదాడి పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాలు ప్రత్యక్షయుధ్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్థాన్ ఎటాక్ చేసింది. భారత్ కూడా బదులిచ్చింది. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ పై ప్రతిదాడికి దిగింది. పాకిస్తాన్ కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ పై వైమానిక దాడులు మిస్సైల్స్ తో విరుచుకుపడింది. కరాచీ పోర్టును పూర్తిగా ద్వంసం చేసింది భారత్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu narendra-modi operation-sindhoor

Related Articles