సైబర్ భద్రత సన్నధ్ధతపై బ్యాంకులు , ఆర్బీఐ , ఎన్పీసీఐ , భీమా సంస్తల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ పాక్ ఉద్రిక్తతలు చాలా దారుణంగా ఉన్నాయి. దాయాది దేశం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంది. ఇలాంటి టైంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థ కు కొన్ని కీలక సూచనలు చేశారు. ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా చూడాలని ..బ్యాంకులు ఆగకుండా నిరంతరాయంగా సేవలు అందించాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.
సైబర్ భద్రత సన్నధ్ధతపై బ్యాంకులు , ఆర్బీఐ , ఎన్పీసీఐ , భీమా సంస్తల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె అధికారులకు చాలా సూచనలు చేశారు కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏటీఎం లలో డబ్బులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని , యూపీఐ సేవలు మరింత సులువుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యుధ్ధం వాతావరణంలో ప్రజలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా సిధ్దంగా ఉండాలని , దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భధ్రతకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు.