ఈ వైమానిక స్థావరం పై దాడి చేసినట్లు పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో రెండో అతి పెద్ద వైమానిక స్థావరానికి ప్రధాని మోదీ సందర్శించారు. మంగళవారం ఉదయం ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లి వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. వాయుసేన సిబ్బంది ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధాని తో పంచుకున్నారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపారు ప్రధాని మోదీ . ఆదంపుర్ సందర్శనలో త్రిశూల్ చిత్రం కలిగిన టోపీ ధరించారు. కాగా ఈ వైమానిక స్థావరం పై దాడి చేసినట్లు పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రధానమోదీ.