ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టంగా పేర్కొంది. పాకిస్థాన్ చేసిన ఈ దాడికి ఐక్యరాజ్యసమితి పాకిస్థాన్ ను తీవ్రంగా మందలించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా మందలించింది. పౌరులపై ఉగ్రవాద దాడులు జరపడం ఖండిస్తున్నామని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి లేదా మద్దతు ఇవ్వడానికి ఏ దేశాన్ని అనుమతించబోమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టంగా పేర్కొంది. పాకిస్థాన్ చేసిన ఈ దాడికి ఐక్యరాజ్యసమితి పాకిస్థాన్ ను తీవ్రంగా మందలించింది.
ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా మందలించింది. పౌరులపై ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి లేదా మద్దతు ఇవ్వడానికి ఏ దేశాన్ని అనుమతించబోమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్పష్టంగా పేర్కొంది. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి.. పాకిస్తాన్ అనుమానాస్పద పాత్ర పోషించి, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ నిర్దిష్టమైన పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అలా కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో దాని విశ్వసనీయత దెబ్బతింటుందని కూడా హెచ్చరించింది.ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటంలో పాకిస్తాన్ పారదర్శకంగా, బలమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది.