BSNL: 'జియో,ఎయిర్ టెల్, వీఐ'లకు BSNL షాక్.?

భారత ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వస్తున్నాయి. భారీగా కస్టమర్లను సంపాదించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా అనేకమంది కస్టమర్లను సొంతం చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ


Published Sep 23, 2024 02:45:35 PM
postImages/2024-09-23/1727082935_BSNL5G.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వస్తున్నాయి. భారీగా కస్టమర్లను సంపాదించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా అనేకమంది కస్టమర్లను సొంతం చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా  తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది.

ఇందులో బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో భారీగా కస్టమర్లను పొందినట్టు తెలుస్తోంది. జూలై నెల నుంచి దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారట. ఇదే టైంలో ఎయిర్టెల్,జియో,వి ఐ వినియోగదారుల సంఖ్య తగ్గిందట. దీనికి ప్రధాన కారణం బిఎస్ఎన్ఎల్ టరిఫ్ ప్లాన్లు తక్కువగా ఉండడమే.

ఇప్పటికే బిఎస్ఎన్ఎల్,ఎయిర్టెల్ ఇంతకుముందున్న రేట్లకంటే ఎక్కువగా టారిఫ్ ప్లాన్లు పెంచడంతో చాలామంది కస్టమర్లు తక్కువ ధర ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. అంతేకాదు ఇతర కంపెనీ లో ఉన్నటువంటి కొంతమంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరగడానికి ప్రధాన కారణం ఫై జి నెట్వర్క్.

 ఇప్పటికే ఉన్న ఫోర్జీ టవర్లను ఫైవ్ జి కి అప్ గ్రేడ్ చేస్తుంది. అంతే కాదు మెట్రో పట్టణాల్లో ఇప్పటికే 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫైజీ సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ సన్నద్ధమవుతుందని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line mobile jio bsnl airtel vi 5g-network

Related Articles