HARSHA SAI: హర్షసాయిపై చీటింగ్ కేసు ..2 కోట్లు మోసం !


ఈ లోపే మరో సరికొత్త గొడవతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హర్షాసాయి. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆ యువతి హర్షపై నార్సింగి పోలిస్ స్టేషన్లో కేసుపెట్టింది


Published Sep 24, 2024 12:23:43 PM
postImages/2024-09-24/1727198562_1681e85019e642e0d1efe0a4a66cc5a7.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హర్షసాయి గురించి యూట్యూబ్ తెలిసిన తెలుగు ప్రజలందరికి తెలుసు. తెలుగు , తమిళ్ , హిందీ అన్ని రాష్ట్రాల వారికి హర్షాసాయి చాలా బాగా తెలుసు . అయితే కొన్నాళ్ల నుంచి హర్ష సాయి వివాదాలలో చిక్కుకుంటున్నారు. రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికేశాడు. కవర్ చేశాడు బాగా...కాని కుదర్లేదు. జనాలకు కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ పడింది కాని ..పిచ్చి జనాలు పనిలో పడిపోయి మరిచిపోయారు.


ఈ లోపే మరో సరికొత్త గొడవతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హర్షాసాయి. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆ యువతి హర్షపై నార్సింగి పోలిస్ స్టేషన్లో కేసుపెట్టింది. పెళ్లి పేరుతో తనని నమ్మించి ఏకంగా 2 కోట్లు తీసుకున్నాడని ఆ యువతీ తెలిపింది. అంతేకాదు తన తండ్రి రాధాకృష్ణపై కూడా కంప్లైయింట్ ఇచ్చింది. వీరిద్దరు కలిసే తమను నమ్మించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికారని తెలిపారు.


అయితే ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అని..తనకు కూడా మంచి ఫేమ్ ఉందని టాక్. అయితే హర్ష సాయి తో ఓ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత కూడా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మనే. ఈ కేసు ఆమె పెట్టి ఉంటుందనే అనుమానం కూడా ఉంది. కన్ఫర్మ్ కాదు కాని ఏదో చిన్న అనుమానం ఉంది. ఆ యువతీ ఇచ్చిన స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు. హర్ష సాయిపై చీటింగ్ కేసు పెట్టిన ఆ యువతీ పాత బిగ్ బాస్ కంటెన్స్టంట్ అని ..పలుకుబడి..డబ్బు ఉన్న అమ్మాయని ఇండస్ట్రీ టాక్ . 

newsline-whatsapp-channel
Tags : socialmedia youtuber bigboss cheating-case

Related Articles