ప్రస్తుతం బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి సోనియా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమె హౌస్ లో చేసే రచ్చను బట్టి ఆమెను సోషల్ మీడియాలో ఓ కోణాన
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి సోనియా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమె హౌస్ లో చేసే రచ్చను బట్టి ఆమెను సోషల్ మీడియాలో ఓ కోణాన ఆడేసుకుంటున్నారు. అలాంటి సోనియా హౌస్ లోకి వెళ్లక ముందు అనేక పనులు చేసిందట.. అయితే ఆమెకి అప్పటికే పెళ్లై విడాకులు అయిందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు బిగ్ బాస్ సోనియాకు చిరంజీవి కూతురు శ్రీజ మొదటి భర్తతో రిలేషన్ ఉండేదట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన కుటుంబాన్ని వదిలిపెట్టి శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ గురించి అనేక వార్తలు వినిపించాయి. అయితే వీరికి ఒక కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు శ్రీజ భరద్వాజ్ తో విడిపోయింది. ఆ తర్వాత శ్రీజ తన తండ్రితోనే ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలోనే శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మరణించాడు. ఇవన్నీ పక్కనబెడితే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియాకు సిరీస్ భరద్వాజ్ కు ఒక మంచి రిలేషన్ ఉండేదట.
వీరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ వల్ల శ్రీజ అప్పుడప్పుడు భరద్వాజ్ ని కోప్పడేదట. కానీ వీరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే అని తెలుస్తోంది. అంతేకాదు భరద్వాజ్ మరణించిన సమయంలో సోనియా చాలా బాధపడిందట. అలాగే తన సోషల్ మీడియా ఖాతాలో ప్రియమైన నా స్నేహితుడా నాకేదైనా ఆపద వస్తే నాకు హెల్ప్ చేసే నువ్వు ఇప్పుడు నా ముందు లేకపోవడం చాలా బాధనిపిస్తుంది అంటూ పోస్ట్ పెట్టిందట. ప్రస్తుతం సోనియా హౌస్ లో ఉంది కాబట్టి ఈమె గురించి మరియు భరద్వాజకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.