gold: మళ్లీ పెరిగిన బంగారం ధర ..ఈ సారి గ్రాము మీద ఎంత పెరిగిదంటే !

మరో రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. 


Published Oct 02, 2024 10:50:00 AM
postImages/2024-10-02/1727846426_images.jpg

న్యూస్ , లైన్, స్పెషల్ డెస్క్: పసిడిప్రియులకు నిరాశే ఎదురైంది. బంగారం ధర మళ్లీ పెరిగింది దాదాపు రెండు వారాల నుంచి పెరుగుతున్న బంగారం ధర ఈ రోజు మరింత పెరిగింది. వెండి రేటు కూడా పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ తగ్గడం వల్ల అన్ని రాష్ట్రాల్లో బంగారం , వెండి రేట్లు తగ్గాయి. మరో రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. 


22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 50 తగ్గింది. 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,100 గానూ, 8 గ్రాముల బంగారం ధర రూ. 56,800 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 71,000 గానూ ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50 పెరిగింది . 24 క్యారట్ల బంగారం ధర గ్రాము 7600 ధర  నడుస్తుంది.


*ఇక ఢిల్లీ మార్కెట్లో చూసిన ట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 50పెరిగింది. దీంతో రూ. 71,100 వద్దకు దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 71,000 పలుకుతోంది. 


దాదాపు అటు నార్త్ ఇటు సౌత్ రెండు వైపులా బంగారం దాదాపు ఇదే ధరతో నడుస్తుంది. తెలుగురాష్ట్రాల్లో , తెలంగాణ , కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి.


ఇప్పటికే వెండి లక్ష రూపాయల మార్క్ ను దాటేసింది. అయితే నేడు వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గింది. రూ. 1,01,000 వద్దకు దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గి..రూ. 95వేల వద్దకు దిగివచ్చింది. కలకత్తా, బెంగుళూరు, గుజరాత్ వెండి ధర 93వేల చిల్లర నడుస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate

Related Articles