Viral Video: పోయిందిగా ..పెళ్లిలో పరువుపోయిందిగా ..ఈ పెళ్లి కొడుకు పరిస్థితి చూడండి!

పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎత్తుకొని చిందులు వేశాడు. అసలు ఈ మధ్య పెళ్లి కూతుర్ని ఎత్తుకొని పబ్లిక్ రొమాన్స్ చెయ్యడం ఫ్యాషనే కదా. 


Published Oct 04, 2024 08:07:00 PM
postImages/2024-10-04/1728052748_376607edem.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ప్రతి పెళ్లిలోను ఏదో ఒక స్వీట్ మెమొరీ ..బ్యాడ్ మెమొరీ ఉంటూనే ఉంటాయి. కాని మన పెళ్లిలో మనకే బ్యాడ్ మెమొరీ అయితే మాత్రం ఎన్నాళ్లయినా ఆ గిల్ట్ చాలా చిరాకు గా ఉంటుంది. లక్షలు ఖర్చు చేసి ...హీరోలా పోజులు కొట్టాల్సిన రోజు మన పరువే పోతే అసలు ఊహించుకోలేం.


సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పెళ్లి వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంతోషంతో చిందులు వేస్తున్నారు. వధువు తరపు బంధువులు, వరుడు తరపు బంధుపులు పెళ్లి వేడుకకు హాజరైయ్యారు. హుషారు మీదున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎత్తుకొని చిందులు వేశాడు. అసలు ఈ మధ్య పెళ్లి కూతుర్ని ఎత్తుకొని పబ్లిక్ రొమాన్స్ చెయ్యడం ఫ్యాషనే కదా. 


అలా చాలా హ్యాపీ గా పెళ్లి కూతుర్ని ఎత్తుకున్నాడు.  పెళ్లి కొడుకు కిందికి దించేటప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. చినిగిపోవడం అంటే అలా ఇలా చిన్నగా కుట్టు ఊడటం కాదు ఏకంగా ఏ పార్ట్ కు ఆ పార్ట్ చినిగి ..ప్యాట్ ఓపెన్ కూడా అయిపోయింది. కాస్త నిజంగా చిరిగినట్లు అనిపించలేదు కాని ..అక్కడి వాళ్లంతా కాస్త పెళ్లి కొడుకు పరువు పోకుండా కోట్లు అడ్డం పెట్టి మనోడి పరువును కాపాడారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Seva Can (@seva_can111)

newsline-whatsapp-channel
Tags : viral-news marraige wedding viral-video

Related Articles