Divorce: తెలుగు స్టార్ హీరోయిన్ విడాకులు.?

ఏంటి ఆ స్టార్ హీరోయిన్ కి భర్త బ్రేకప్ చెప్పారా.. పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక బ్రేకప్ ఏంటి..వీరిద్దరి మధ్య కూడా గొడవలు వస్తున్నాయా.. ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారా.. ఇంతకీ విడాకులు


Published Oct 04, 2024 09:11:30 PM
postImages/2024-10-04/1728056490_JENILIYA.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి ఆ స్టార్ హీరోయిన్ కి భర్త బ్రేకప్ చెప్పారా.. పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక బ్రేకప్ ఏంటి..వీరిద్దరి మధ్య కూడా గొడవలు వస్తున్నాయా.. ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారా.. ఇంతకీ విడాకులు తీసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరో ఎప్పుడు చూద్దాం.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ  వార్తల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు జెనీలియా.. నటి జెనీలియా  విడాకులు తీసుకుబోతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దానికి ప్రధాన కారణం జెనీలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే..

తన భర్త అర్ధరాత్రి బ్రేకప్ అంటూ మెసేజ్ చేశాడు అంటూ జెనీలియా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే జెనీలియా చెప్పిన విషయాలు ఇప్పటివి కావు. పెళ్లి కాకముందు డేటింగ్ లో ఉన్న సమయంలోనట. అయితే జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ల అభిరుచులు  వేరుగా ఉంటాయట. రితేష్ అర్ధరాత్రి వరకు పడుకునే వారు కాదట.కానీ జెనీలియా మాత్రం తొందరగా పడుకునేదట. ఇక ఓ రోజు ఏం చేయాలో అర్థం కాక రితేష్ జెనీలియాని  భయపెడదామని బ్రేకప్ అంటూ ఒక మెసేజ్ పెట్టారట. ఇక ఉదయాన్నే ఫోన్ లో ఆ మెసేజ్ చూసిన జెనీలియా చాలా ఏడ్చిందట.

కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి ఏమీ తెలియని వాడిలా ఫోన్ చేసి మాట్లాడడంతో ఏడుస్తూ జెనీలియా రాత్రి ఏం మెసేజ్ పెట్టావ్ అని అడగగా అయ్యో ఆ మెసేజ్ వట్టిదే.. నిన్ను జోకర్ ని చేద్దామని అలా పెట్టాను. జస్ట్ జోకింగ్ అంతే అని చెప్పారట.కానీ ఆరోజు రితేష్ పెట్టిన బ్రేకప్ మెసేజ్ కి జెనీలియాకి గుండె పగిలినంత పని అయిందట. ఇక ఈ జంట ప్రేమించుకున్నాక చాలా రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bommarillu jeniliya rithesh-deshmuch dhee

Related Articles