LIPS: గులాబీ లాంటి పెదవుల కోసం సులువైన చిట్కాలు !

పెదాలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది అంతా లిప్ స్టిక్ మాయ. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అందంగా ఉండే పెదాలు రంగులు పూయకుండానే వస్తాయి. రండి చూసేద్దాం.


Published Oct 04, 2024 07:16:00 PM
postImages/2024-10-04/1728049590_HDwallpaperredlipsredroseredroseflowersnaturelipsofwomanredlips.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అసలు ఎర్రని పెదాలేంటి...ఈ రోజుల్లో పెదవులు ఏ రంగైనా ఉంటాయి. అంతా లిప్ స్టిక్ మాయ. నేచరల్ బ్యూటిఫుల్ అందాలు ఎప్పుడో పోయాయి. అంతా మేకప్పే. కాని చిన్న చిన్న టిప్స్ తో నేచురల్ గ్లోయింగ్ అందాలను చూడొచ్చు. పెదాలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది అంతా లిప్ స్టిక్ మాయ. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అందంగా ఉండే పెదాలు రంగులు పూయకుండానే వస్తాయి. రండి చూసేద్దాం.


* ఎండలో ఎక్కువగా తిరగడం, లిప్‌స్టిక్‌లు అతిగా వాడటం, కాఫీ, టీలు ఎక్కువసార్లు తీసుకోవడం... వాంటి వాటివల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. కాబట్టి చీప్ కాస్మోటిక్స్ వాడకండి. దీని వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. సో కాస్త నేచురల్ ప్రాడెక్ట్స్ పై శ్రధ్ధ పెట్టండి.


*బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ గుజ్జుతో పాటుగా కొత్తిమీర రసాన్ని రోజూ పెదాలపైన రాస్తూ ఉండండి. వీటికి పిగ్మంటేషన్ ను తగ్గించే గుణం ఉంది.


*తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాసుకోవడం వల్ల నలుపు రంగు తగ్గుతుందని సూచిస్తున్నారు.


*పెదాలకు తగినంత తేమ లేకపోవడం వల్ల కూడా నల్లగా మారతాయంటున్నారు నిపుణులు.


 *బాదం నూనెని అప్లై చేయడం వల్ల పెదాలకు తగినంత తేమ అందుతుందని సూచిస్తున్నారు. 


మీ ముఖం అందంగా కనిపించాలంటే ముందు మీ శరీరం బాగుండాలి...అంటే ఆరోగ్యంగా ఉండాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొండి. రోజు పెదవులకు స్కబ్బింగ్ చేసుకుంటే రెడ్ లిప్స్ మీ సొంతం.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles