విషాదం: కన్నీటి సంద్రంలో వేణు స్వామి కుటుంబం.!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు. సినీ రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఒక స్టార్ హీరోకు ఎలాంటి పేరు ఉంటుందో ఆ


Published Oct 04, 2024 07:24:22 PM
postImages/2024-10-04/1728050062_VENU.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు. సినీ రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఒక స్టార్ హీరోకు ఎలాంటి పేరు ఉంటుందో ఆ విధమైనటువంటి పేరును సంపాదించుకున్నారు. అలాంటి వేణు స్వామి ఇంట్లో తీవ్రమైన విషాదం నెలకొంది. వేణు స్వామి తల్లి విజయలక్ష్మి అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి  చెందిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

తన సోషల్ మీడియా వేదికగా మా అమ్మగారు ఈరోజు ఉదయం మరణించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు సానుభూతి పరులంతా  ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక వేణు స్వామి సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు. కానీ ఆయన ఈ మధ్య చెప్పినటువంటి రాజకీయ నాయకుల జాతకాలు తారుమారవ్వడంతో వివాదాల్లో ఇరుక్కున్నారు.

తెలంగాణలో కేసీఆర్ పార్టీ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ గెలిచింది.  ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని ఆయన చెబితే చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది.  దీంతో ఆయన చెప్పిన ఈ రెండు మిస్ ఫైర్ అవ్వడంతో  ఆయన జాతకాలు అన్ని అబద్ధాలు అంటూ కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr cm-jagan newslinetelugu tollywood venuswamy vijayalakshmi

Related Articles