LOVE REDDY: యాక్టింగా..నిజామా..లవ్ రెడ్డి యాక్టర్ పై మహిళ దాడి !

ఓ మహిళ చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. లవ్ రెడ్డి సినిమాలో కొన్ని సీన్లు చూసి ఆడియన్స్ చాలా ఎమోషనల్ అయిపోయారు.


Published Oct 25, 2024 02:07:00 PM
postImages/2024-10-25/1729845620_32021422755529thumbnail16x9actor.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లవ్ రెడ్డి మూవీ టీం కు అనుకోకుండా ఓ విచిత్రమైన సంధర్భం ఎదురైంది. తమ మూవీ ఆడియన్స్ కు ఎంత నచ్చిందో తెలుసుకుందామనుకున్నారు టీం. ఈ సమయంలో ఓ మహిళ చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. లవ్ రెడ్డి సినిమాలో కొన్ని సీన్లు చూసి ఆడియన్స్ చాలా ఎమోషనల్ అయిపోయారు. అలా ఎమోషనల్ అయిన ఓ మహిళ సినిమాలో చేసిన రామస్వామిని కాలర్ పట్టుకొని నీకు జాలి లేదా ...ఎందుకు వారిని విడదీసేశావ్ ..అంటు దుర్భాషలాడింది. 


వెంటనే హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఆ మహిళను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోయే సరికి ఆ మహిళతో పాటు వచ్చిన వారు , ఇతర ప్రేక్షకులు నచ్చజెప్పారు. అప్పుడు ఊరుకుంది. దీంతో మూవీ టీం కాస్త ఊపిరి పీల్చుకొని ఈ నెల 18న రిలీజ్ అయినా లవ్ రెడ్డి చిత్రంలో అంజన్ రామచంద్ర శ్రావణి జంటగా నటించారు. మంచి టాక్ తో థియేటర్ లో దూసుకుపోతుంది .


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news

Related Articles