Ka Movie Trailer: అంచనాలు పెంచుతున్న 'క' ట్రైల‌ర్‌.. కిరణ్ అబ్బవరం అదరగొట్టేశాడు!

దివాళీ కానుకగా వస్తున్న కిరణ్ అబ్బవరం అక్టోబర్ 31 వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నారు


Published Oct 25, 2024 11:18:00 AM
postImages/2024-10-25/1729835421_hympcollagekiran.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన  తాజా చిత్రం " క" ఈ మూవీకి సుజిత్ , సందీప్ ఇద్దరు డైరక్ట్ చేస్తున్నారు. అయితే మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దివాళీ కానుకగా వస్తున్న కిరణ్ అబ్బవరం అక్టోబర్ 31 వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నారు.  దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండ‌డంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది. 


ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై అంచ‌నాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు జోడిగా తన్వీ రామ్‌ నటించింది. ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం యాక్షన్ సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే. దీనిపైనే అంచనాలున్నాయి. అయితే కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ చాలా బాగా ఛూస్ చేసుకుంటారు. సో ప్రేక్షకులకు సినిమా మీద చాలా మంి అంచనాలున్నాయి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news kiran-abbavaram

Related Articles