గ్రామీణ నేపథ్యంలో సాగే కథ పొట్టేల్ ..సినిమా టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్రామీణ నేపథ్యంలో సాగే కథ పొట్టేల్ ..సినిమా టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కింది సినిమా. అసలు పొట్టేల్ కథ ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ లోకి వెళ్లిపోదాం..1970, 80 లో జరిగే స్టోరీ . తెలంగాణ , మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గుర్రంగట్టు అనే ఊరిలో అక్కడి గ్రామ దేవత బాలమ్మకు 12 యేళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తుంటారు. ప్రతి జాతరకీ పొట్టేల్ బలి ఇవ్వడం ఆనవాయితీ. కాని జాతరకు ముందే పొట్టేళ్లు చనిపోవడంతో ఊరిలో కరువు వస్తుంది. దీంతో ఇదంతా జాతరకు ముందే పొట్టేల్ చనిపోవడం వల్లే ఈ కరువు సంభవించిందని ఊరంతా నమ్ముతారు. ఈ సారి జాతరలో పొట్టేల్ చనిపోకుండా ఊర్లో యువకుడైన గంగాధరీ అనే కుర్రాడికి అప్పగిస్తారు.తన బిడ్డ చదువు కోసం చాలా కష్టపడుతుంటాడు గంగాధరీ.
ఊర్లో అజయ్ డామినేషన్ చాలా ఎక్కువ . అమ్మవారు బాలమ్మ తనని పూనిందని చెబుతూ, గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడుతుంటాడు పటేల్. కానీ అతడి నిజ స్వరూపం గంగాధరీకి తెలుసు. కానీ, ఊరి జనాలు గంగాధరీ మాటలు నమ్మరు. ఈ క్రమంలోనే జాతర దగ్గర పడుతున్న సమయంలో గంగాధరీ సంరక్షణలోని ఉన్న పొట్టేల్ మాయం అవుతుంది. దీంతో పటేల్‌తో పాటు, ఊరి జనం అతడిపై మండిపడతారు. అమ్మవారి పొట్టేల్‌ను తిరిగి తీసుకు రావల్సిందేనని, లేదంటే బడికెళుతున్న గంగాధరీ కూతురు సరస్వతిని బలి ఇస్తానని చెబుతాడు పటేల్. కూతురు ప్రాణాల కోసం గంగాధరీ చాలా కష్టపడతాడు. పొట్టేల్ ను వెతికే ప్రయాణంలో గంగాధరీ భార్య అనన్య కూడా వెతుకుతుంది. అసలు ఈ పొట్టేల్ ఎవరు మాయం చేశారు..ఎందుకు చేశరు . ఇదే కథ.
ప్రజల మూఢనమ్మకాలు ..అప్పట్లో ఓ పిల్లను చదివించడానికి ఎంత కష్టపడాలి. అందులోను ఓ వర్గం సాగించిన దురాగతాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. హీరో , హీరోయిన్ మధ్య ప్రేమ కథ బాగుంటుంది. కాని సెకండాఫ్ చాలా లాగ్. అంత బాలేదు. సినిమాలో మ్యాజిక్ తప్ప లాజిక్ ఉండదు. చిన్న చిన్న సమస్యలున్నాయి ...అయినా ..స్క్రీన్ మీద ఏదో మాయ చేసింది .చిన్న చిన్న లోపాలున్నా సినిమా బాగుంది.
పటేల్ పాత్రలో అజయ్ నటన బాగుంది. ఆ పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. గంగాధరీ పాత్రలో యువ చంద్ర కృష్ణ మంచి నటనను ప్రదర్శించాడు. బుజ్జమ్మ పాత్రలో అనన్య నాగళ్ల బానే నటించింది. ఉపాధ్యాయుడు దుర్యోధనగా శ్రీకాంత్ అయ్యంగార్ మెప్పించారు. అన్ని విభాగాల్లో పనితీరుని కనిపించారు.