KTR: న్యూస్ లైన్ వార్తకు స్పందించిన కేటీఆర్.. యువతికి ఆర్థిక సాయం

అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక వాకిట్లో తల్లి శవాన్ని పెట్టుకొని భిక్షాటన చేస్తున్న ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.


Published Aug 18, 2024 07:30:50 AM
postImages/2024-08-18/1723980575_girl2.PNG

న్యూస్ లైన్ డెస్క్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడా గ్రామంలో జరిగింది. కొంతకాలం క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం తల్లిపైనే పడ్డాయి. వారికి ఒక కూతురు ఉంది. చేసిన కష్టం సరిపోక.. అప్పులు తీర్చలేక.. నిత్యం వేధించే అప్పుల వాళ్ల మాటలు పడలేక తల్లి ఆత్మహత్య చేసుకోగా బాలిక అనాధగా మారింది. తల్లి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక వాకిట్లో తల్లి శవాన్ని పెట్టుకొని భిక్షాటన చేసింది. ఈ దృశ్యం చూసేవారికి కంటతడి పెట్టిస్తోంది.

అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక వాకిట్లో తల్లి శవాన్ని పెట్టుకొని భిక్షాటన చేస్తున్న ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం గురించి ముధోల్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడానాని, వారు వెంటనే యువతి ఇంటికి వెళ్లి ఆమెను ఆదుకోవడం జరుగుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి యువతికి అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. కాగా, కేటీఆర్ ఆదేశాల మేరకు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు చిన్నారిని కలుసుకుని తక్షణ సహాయంగా రూ. 10,000 వేలు అందజేశారు. తను పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడతానాని, ఆమె సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎలా సహాయపడగలమో ప్లాన్ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs congress ktr girls

Related Articles