ZEBRA REVIEW: జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!

సత్యదేవ్ కు చిరంజీవి కూడా సపోర్ట్ చేశారు. సినిమా కాస్త రీచ్ వచ్చింది. ఎంతవరకు ఉపయోగపడిందో ...సత్యదేవ్ ఎలా యాక్ట్ చేశాడో చూద్దాం.


Published Nov 22, 2024 07:15:00 AM
postImages/2024-11-22/1732281173_zebrareview1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సత్యదేవ్ సినిమా అనగానే చాలా డిఫరెంట్ సినిమా ..మినిమమ్ గ్యారెంటీ సినిమా. అయితే సత్యదేవ్ , డాలీ ధనుంజయ్ మెయిన్ లీడ్స్ లో నటించిన పెంగ్విన్ ఫేమ్ ..ఈశ్వర్ కార్తీక్ డైరక్షన్ లో వస్తున్న వైట్ కాలర్ క్రైమ్ డ్రామా జీబ్రా . అయితే సత్యదేవ్ కు చిరంజీవి కూడా సపోర్ట్ చేశారు. సినిమా కాస్త రీచ్ వచ్చింది. ఎంతవరకు ఉపయోగపడిందో ...సత్యదేవ్ ఎలా యాక్ట్ చేశాడో చూద్దాం.


బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్ షిప్ మ్యానేజర్ గా వర్క్ చేసే సూర్య తన తెలివైన తల్లి, తనను ప్రాణంగా ఇష్టపడే అమ్మాయితో స్వాతి తో పాటు , స్నేహితుడు బాబ్ తో సావాసం చేస్తూ లైఫ్ ను నెట్టుకొచ్చేస్తుంటాడు. స్వాతి కి బ్యాంకులో నాలుగు లక్షల రూపాయిల బ్యాంక్ ఫ్రాడ్ జరుగుతుంది. అందులో నుంచి స్వాతిని తప్పించడానికి 5 కోట్ల రూపాయిల ఫ్రాండ్ లో ఇరుక్కుంటాడు. విలన్ ను ఎలా కలిసాడు..డబ్బు ఎలా సంపాదించాడు..ఫ్్రాడ్ లో ఎలా ఇరుక్కున్నాడనేదే ..జీబ్రా.


డాలీ మంచి నటుడు అనే విషయం తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేదు. “పుష్ప”లో సైడ్ విలన్ గా మాత్రమే చూపించగా, ఈ సినిమాలో సత్యదేవ్ ను డామినేట్ చేసేలా యాక్ట్ చేశాడు. సత్యదేవ్ కూడా డాలీ ని బీట్ చేశాడు. అందుకే ఈ సినిమా కు ఇద్దరు హీరోలు . ఇద్దరు సూపర్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమా లో సునీల్ చాలా డిఫరెంట్ రోల్ లో చాలా బాగా చేశాడు. సినిమా బాగుంది. కాని కన్విన్సింగ్ గా లేదు.  ఆడియన్స్ వైపు కూడా ఆలోచించి ఉంటే చిన్న చిన్న లాజిక్స్ ఫాలో అయ్యి ఉంటే సూపర్ హిట్ అయ్యి ఉండేది. ఈ చిన్న తప్పు వల్ల ..సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తుంది. అయినా జనాలు చూసేస్తారు. సత్యేద్ అక్కడ...సో సో అయినా చూస్తారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news review satyadev zebra-movie

Related Articles