ప్రతి వస్తువుపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను అందిస్తుంటాయి. రీసెంట్ గా బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అనౌన్స్ చేశారు ఈ కామర్స్ కంపెనీలు అవేంటో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆన్ లైన్ షాపింగ్ చేసే వారు ఇప్పుడు వందలో 80 శాతం . అయితే ఈ కామర్స్ వాల్యూస్ పెరిగాయి. వస్తువులు కొనుగోళ్లు , క్వాలిటీ అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి సేల్స్ బాగున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఏదోక ఆఫర్ పెడుతూనే ఉంటారు. తమ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ ను అందిస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటాయి. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, లాప్ టాప్స్, బట్టలు ఇలా ప్రతి వస్తువుపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను అందిస్తుంటాయి. రీసెంట్ గా బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అనౌన్స్ చేశారు ఈ కామర్స్ కంపెనీలు అవేంటో చూసేద్దాం.
క్రిస్మస్ పండగ షాపింగ్ కోసం యూస్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి శుక్రవారం రోజు షాపింగ్ కోసం ప్రత్యేకంగా ఈ సేల్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, టాటా క్లిక్ లు ఈ ఆఫర్లు అనౌన్స్ చేశాయి.
నవంబర్ 24 నుంచి 29 వరకు నిర్వహించనుంది. అలాగే అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నది. ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంది. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్.. హోమ్ అప్లయెన్సెస్ పై 75 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ ను చాలా ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోవాలంటున్నారు నెటిజన్లు.