ఒకదశలో 1975 నుంచి 1990 వరకు మోహన్ బాబు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు చాలా బాగా న్యాయం చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీ మంచు మోహన్ బాబు తెలియని వారు ఉండరు.కలక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పౌరాణికం , చారిత్రక జానపదం , సాంఘిక సినిమాల్లోను ఎన్నో విభిన్న పాత్రలు నటించి మెప్పించారు. మంచు మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. హీరో, నెగిటివ్ , కామెడీ , జానపద , యముడిగా చాలా వైవిద్యమైన పాత్రలు చేశారు. ఒకదశలో 1975 నుంచి 1990 వరకు మోహన్ బాబు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు చాలా బాగా న్యాయం చేశారు.
‘స్వర్గం నరకం’ హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 1990వ దశాబ్దంలో, మోహన్ బాబు గారు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. చాలా సినిమాల్లో...నటించినా ...పెదరాయుడు ఓ స్పెషల్ . పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో చాలా గ్రాండ్ గా చేశారు. ఆ వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ క్రేజ్ మోహన్ బాబును ..రాజకీయాల్లోకి వచ్చాడు.
1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం.. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి లేదు. దీని తర్వాత సినిమాలే కాకుండా ..బిజినెస్ లో కూడా అడుగు పెట్టారు. 1992 లో శ్రీవిద్యానికేతన్ విద్యాట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. 2024 డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను ప్రారంభిస్తారు. 2025 నవంబర్ వరకు ప్రతీ నెలా ఒకటో తేదీన ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ రికార్డ్ . చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ లో కన్నప్ప లో మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. ఇండస్ట్రీ లో 50 అద్భుత సంవత్సరాలకు మోహన్ బాబు గారికి శుభాభినందనలు.