టెలికాం సేవలు అందవు. ఇంటర్నెట్ సరిగ్గా రాదు. ఇలాంటి ప్రదేశాల్లో తమ సర్వీస్ లను మెరుగుపరుచుకోవడానికి ప్లాన్ చేస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుతం BSNL షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంది. టాటా కంపెనీ పెట్టుబడులు పెట్టినదగ్గర నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా..మధ్యతరగతి ..బిలో మధ్యతరగతికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తుంది.అయితే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో BSNL ఫ్రీ వైఫై ను ఏర్పాటు చేస్తుంది.శబరిమల కొండ ప్రాంతం ఇంకా అటవీ ప్రాంతం కావడంతో అక్కడకు వచ్చే అయ్యప్ప భక్తులకు నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా టెలికాం సేవలు అందవు. ఇంటర్నెట్ సరిగ్గా రాదు. ఇలాంటి ప్రదేశాల్లో తమ సర్వీస్ లను మెరుగుపరుచుకోవడానికి ప్లాన్ చేస్తుంది.
శబరిమలలోని మొత్తం 48 ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ వై-ఫై కనెక్షన్లను రెఢీ చేసింది. BSNL ఇప్పటిదాకా శబరిమల, పంపా, నిలక్కల్ వంటి ఫేమస్ ప్లేస్ ల్లో పబ్లిక్ Wi-Fi సర్వీస్ లను ఇస్తుంది. తిరువనంతపురం దేవస్వం బోర్డ్ సహకారంతో నెట్వర్క్ ని బాగా డెవలప్ చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలోకొన్ని 4G టవర్లను కూడా ఫిక్స్ చేసింది.
అయితే శబరిమాల, పంబా యాత్రికులకు ఉపయోగపడేలా 24 అవర్స్ పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్ను రెఢీ చేయనున్నారు. శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులు శబరిమల, నిలక్కల్, పంపాలో BSNL Wi-Fi సర్వీస్ లను ఎలాంటి ప్రాబ్లెం లేకుండా పొందవచ్చు. సేమ్ మనం రైల్వే స్టేషన్స్ లో ఎలా అయితే ఫ్రీ వైఫై అందుస్తారో అలానే అందిస్తున్నట్లు తెలిపారు.