కరాచీ, లాహోర్, రావల్పిండి మూడు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే స్టేడియాల ఆధునీకరణ పూర్తి కావొచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కి దాదాపు 8 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ తమ జట్లను ప్రకటించాయి. ఈ నెల 12 లోగా జట్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడడంతో ఐసీసీ ప్రమోషల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గీతాన్ని విడుదల చేసింది. " జీతో బాజీ ఖేల్ కే " అంటూ పాటను సాగుతుంది. ఈ పాటను పాకిస్థానీ సింగర్ అతిఫ్ అస్లాం పాడారు. నెటింట్లో ఈ పాట అప్పుడే ఫుల్ వైరల్ అవుతుంది.
కరాచీ, లాహోర్, రావల్పిండి మూడు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే స్టేడియాల ఆధునీకరణ పూర్తి కావొచ్చింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. భద్రతాకారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఈనేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ ట్రోర్నీకి అన్ని దేశాల ఆటగాళ్లు రెడీ గా ఉన్నారు. టోర్నీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
The wait is over!
![]()
Tags : newslinetelugu dubai cricket-news