ఒకప్పుడు సౌత్ అనగానే ఇడ్లీ ..సాంబార్ అంటూ స్టేజ్ మీదే ఎగతాళి చేసేవారు. ఇప్పుడు చావా తప్ప పెద్ద గా చెప్పుకునే హిట్లు లేవు. సో ..ఆమీరా ఖాన్ లాంటి పెద్ద వాళ్లు కూడా బాలీవుడ్ పతనానికి కారణాలేంటో వెతుక్కుంటున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఒకప్పుడు హాలివుడ్ తర్వాత ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ . దేశాల దేశాల కు బాలీవుడ్ చాలా తెలుసు. ఇండియా అంటే బాలీవుడ్ అనేలా ఉండేది. కాని ఇప్పుడు దేశ దేశాలకు టాలీవుడ్ పేరు మారుమోగిపోతుంది. ఇది బరించలేకపోతున్నారు బాలీవుడ్ జనాలు. కొంత మంది బయటపెట్టేస్తున్నారు. మరి కొంతమంది బయటపెట్టడం లేదు. కాని బాలీవుడ్ ...సౌత్ ఇండియా మీద నిప్పులు కక్కుతుందని అందరికి తెలిసిందే. ఒకప్పుడు సౌత్ అనగానే ఇడ్లీ ..సాంబార్ అంటూ స్టేజ్ మీదే ఎగతాళి చేసేవారు. ఇప్పుడు చావా తప్ప పెద్ద గా చెప్పుకునే హిట్లు లేవు. సో ..ఆమీరా ఖాన్ లాంటి పెద్ద వాళ్లు కూడా బాలీవుడ్ పతనానికి కారణాలేంటో వెతుక్కుంటున్నారు.
అసలు ఈ తలనొప్పంతా ...ఓటీటీ వాళ్లే జరిగిందంటూ ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారు. జనాలకు అప్పుడు ఆప్షన్ లేదు...ఏ సినిమా అయినా థియేటర్ లో చూడాలి. లేదా టీవీ లో వేస్తే చూడాలి. కాని ఇప్పుడు అలా కాదు జనాలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సబ్ స్క్రిప్షన్ వేస్తే చాలు అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో జనాలు ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలంటే ఇప్పుడు సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు సినిమా ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు వచ్చి చూడటం లేదని అన్నారు. సినిమాను ఎక్కడి నుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్ తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని చెప్పారు. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని కోరారు.