చాలా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు. రీసెంట్ గా "క" మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కిరణ్ అబ్బవరం సినిమా లకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంటాడు. రీసెంట్ గా "క" మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు.కిరణ్ నటిస్తున్న 'దిల్ రూబా' చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అసలు దిల్ రూబా ఎలా ఉందో చూసేద్దాం.
సిద్ధు రెడ్డి (కిరణ్ అబ్బవరం) చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన మ్యాగీ (క్యాతి డేవిసన్) ను ప్రేమిస్తాడు. కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ ని బిజినెస్ పార్టనర్ ను చేసుకుంటే ఆ ఫ్రెండ్ మోసం చేయడంతో తట్టుకోలేక సిద్దు తండ్రి చనిపోతాడు. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల మ్యాగీతో సిధ్దు బ్రేకప్ అవుతుంది. ఇక అప్పటి నుంచే తన జీవితంలో సారీ, థ్యాంక్స్ అనే మాటలకు దూరంగా ఉండాలని సిద్ధు నిర్జయించుకుంటాడు.
బ్రేకప్ నుంచి తప్పించుకోవడానికి బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు సిద్ధు. అక్కడ పరిచయమైన అంజలి (రుక్సర్ థిల్లాన్)ను ప్రేమిస్తాడు. కాలేజీ గొడవల్లో వీళ్లు ఇద్దరు కూడా విడిపోతారు. అమెరికాలో ఉంటున్న మ్యాగీ ఇది తెలుసుకుని ఇండియాకు చేరుకుంటుంది. ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఇద్దరు బ్రేకప్స్ ఎందుకు జరిగాయనేదే స్టోరీ.
కాని ఈ సారి కిరణ్ అబ్బవరం స్టోరీ సెలక్షన్ బాలేదు. ఎందుకో స్టోరీ లైన్ అంత కన్విన్సింగ్ గా లేదు. కిరణ్ అబ్బవరం నుంచి జనాలు ఇంకా మంచి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కథలోని ఎమోషన్‌తో ప్రేక్షకుడు ఎక్కడా కూడా కనెక్ట్ కాలేడు. హీరో పాత్రతో అవసరం ఉన్నా లేకపోయినా దర్శకుడు వాట్సాప్, ఇన్‌స్టా కొటేషన్స్ లాంటి డైలాగ్స్ చెప్పించడం చాలా కామిడీ గా ఉంది.కథ లో పట్టు లేదు.. సో యాక్టర్స్ అంతా తమ నటనతో న్యాయం చేసినా సినిమా కథ , కథనం తో పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అలా టైం పాస్ కు వెళ్తే చూడొచ్చు. కిరణ్ డైలాగ్స్ లో పూరీ జగన్నాథ్ కనిపించాడు. కాని మ్యాజిక్ జరగలేదు. ఫైనల్‌గా 'క'లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తరువాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన ఈ 'దిల్ రూబా' సాదాసీదా కథతో ఉండటంతో ప్రేక్షకులు నిరాశపడక తప్పదు.