భారీగా పొగ కమ్ముకుని ఉండగా..విమానం కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాని ఈ ప్రమాదం అందరు చూస్తుండగా జరగడంతో జనాలు చాలా భయపడిపోయారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ మధ్య చాలా ఎక్కువ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. చూస్తుండగానే విమాన ప్రమాదాలు జరిగి దగ్ధం అయిపోతున్నాయి. ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్ గా అమెరికాలో డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం దగ్ధమైంది. ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయిన కొన్ని నిమిషాలకే విమానం దగ్ధమయ్యింది. దీంతో భారీ ముప్పు తప్పినట్లయ్యింది. భారీగా పొగ కమ్ముకుని ఉండగా..విమానం కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాని ఈ ప్రమాదం అందరు చూస్తుండగా జరగడంతో జనాలు చాలా భయపడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
JUST IN: Frightening footage captures an American Airlines plane on fire at Denver International Airport as passengers were forced out onto the wing. pic.twitter.com/IpzFewyeVM — Fox News (@FoxNews) March 14, 2025