ఈ కేసు తేలే వరకు బాధిత కొరియోగ్రాఫర్ ఫొటోలు కాని వీడయోలు కాని డైరక్ట్ గా పోస్ట్ చేయకూడదని తెలిపింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జానీ మాస్టర్ కేసులో ఓ ముఖ్యమైన కీలకమైన విషయాన్ని తెలియజేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ రిక్వస్ట్ ను లేఖ రూపంలో మీడియాకు రిలీజ్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ పై లైగింకంగా దాడి చేశారనే విషయంపై ఆమె పోలీసులకు పిర్యాధు చేసింది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు తేలే వరకు బాధిత కొరియోగ్రాఫర్ ఫొటోలు కాని వీడయోలు కాని డైరక్ట్ గా పోస్ట్ చేయకూడదని తెలిపింది.
ఫిలిం ఛాంబర్ దాన్ని లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫార్సు చేసింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుంది. శ్రేష్ఠ పోలీసులకు ఫిర్యాదు చేసి FIR నమోదు చేసారు. ఈ విషయంలో బాధితురాల గోప్యతను దృష్టిలో ఉంచుకొండి. అందుకే తన ఫేస్ రివీల్ చేయరాదని కోరింది.సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క ముసుగులు లేని ఫొటోగ్రాఫ్ లను మరియు వీడియోలను ఉపయోగించవద్దు అని, ఎవరైనా అలా వాడితే వెంటనే తీసివేయమని అందరిని అభ్యర్ధిస్తున్నాము అని తెలిపారు.