MAHAESH : మహేష్ , రాజమౌళి చిత్రం లాంచ్ డేట్ ఫిక్స్ !

ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తర్వాత సినిమా కావడం ఓ విశేషం..మహేష బాబుతో సినిమా ఒకటి కావడంతంతో జనాలు మరీ వెయిట్ చేస్తున్నారు.


Published Sep 16, 2024 07:20:00 PM
postImages/2024-09-16/1726494655_194238maheshbabu23.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ..ఎప్పుడెప్పుడు సినిమా గురించి డీటైల్స్ చెప్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.   ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తర్వాత సినిమా కావడం ఓ విశేషం..మహేష బాబుతో సినిమా ఒకటి కావడంతంతో జనాలు మరీ వెయిట్ చేస్తున్నారు.


 ఈ చిత్రం లాంచింగ్ డేట్ బయిటకు వచ్చింది. షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో జక్కన్న ప్లాన్ రెడీ చేసుకున్నారట. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జర్మనీలో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక మహేష్ తన లుక్ ..మేకోవర్ తో ఫుల్ రెడీ గా ఉన్నారట.ఈ సినిమా పీరియడ్ డ్రామా అని, 18 శతాబ్దంలో జరిగే కథ అని తెలుస్తోంది. 


 ఈ సినిమాలో అరుదైన గిరిజన జాతికి సంభందించిన రిఫరెన్స్ లు అలాగే ఉండబోతున్నాయని, దీనికి కోసం చాలా మంది  జూనియర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి షూట్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాని దసరా సీజన్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారు. ఆ రోజే ..సినిమా లో క్రూ విషయాలు బయటకు చెప్తారట. అంతేకాదు టెక్నిషియన్స్ ..మ్యూజిక్ అంతా ఫైనల్ అయిపోయినట్టే. ఈ దసరా కు ఏదో స్టార్ట్ చేసినా ..వచ్చే యేడాది నుంచే రెగ్యులర్ షూట్ జరుగుతుంది.ఈ లోగా టీమ్ మొత్తానికి ఇతర దేశాలకు పాస్ పోర్ట్, వీసా ల విషయాలు ఫైనల్ చేస్తున్నారు. 


ఈ సినిమా కోసం మహేష్ జిమ్ కు వెళ్లి జక్కన్న కు కావాల్సిన బాడీ స్రక్చర్ కోసం కష్టపడుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తున్నారు.  అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. లొకేషన్ హంట్ బాగా లేటైందని తెలుస్తోంది.ప్రాజెక్ట్ బడ్జెట్ అంచనా దాదాపు వెయ్యి కోట్లు. ప్రాజెక్ట్ లో సహనిర్మాతలుగా ..నెట్ ఫ్లిక్స్ మాటలు కలుపుతుందట. మరి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చెయ్యా్ల్సిందే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news mahesh-babu ss-rajamouli

Related Articles