సమంత తెలుగులో ఆ హీరోనే దేవుడిలా ప్రార్థిస్తుందట.! 

సమంత టాలీవుడ్ లో  తిరుగులేని హీరోయిన్ గా పేరు పొందింది. ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలతో ఆమె తెరను పంచుకుంది.  అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇలా


Published Sep 16, 2024 06:59:19 PM
postImages/2024-09-16/1726493359_samantha.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత టాలీవుడ్ లో  తిరుగులేని హీరోయిన్ గా పేరు పొందింది. ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలతో ఆమె తెరను పంచుకుంది.  అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇలా ఎంతోమంది హీరోలతో ఆడి పాడింది.  అలా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దగ్గరికి వస్తున్న సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అలాంటి సమంత కెరియర్ ఫీక్స్ లో ఉండగానే నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది.  అలా ఈ జంట ఎంతో హ్యాపీగా జీవిస్తున్న తరుణంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో సడన్ గా విడాకులు తీసుకొని దూరమైపోయారు.

అయినా సమంత మాత్రం  తన కెరియర్ పై దృష్టి పెట్టి అనేక చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. అలాంటి ఈమె తన కెరియర్ లో నటించినటువంటి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినవి  అత్తారింటికి దారేది, రంగస్థలం, దూకుడు. ఇంకా ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

 అలాంటి ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్, సమంత మధ్య జరిగినటువంటి ఒక  సరదా విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సమంత తెలియజేసింది. అయితే స్విట్జల్యాండ్   షూటింగ్ జరుగుతున్నప్పుడు  బ్రేక్ సమయంలో  సమంత అక్కడ కింద కూర్చుందట. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి నిలబడ్డారట వెంటనే సమంత రెండు చేతులు జోడించి దేవుడా అని నమస్కారం చేసిందట ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఎవరో ఫోటోలు తీసారట. ఈ విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఆయన నాకు గురువుగా ఉండమని కోరుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu nagarjuna tollywood samantha nagachaitanya-

Related Articles