తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎంత స్టార్ డం ఉన్న ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారు కథల విషయంలో సరైన అవగాహన పెంచుకోలేకపోవడం. కానీ
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎంత స్టార్ డం ఉన్న ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారు కథల విషయంలో సరైన అవగాహన పెంచుకోలేకపోవడం. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేటువంటి సుహాస్ మాత్రం హీరోగా అదరగొట్టేస్తున్నారు.
తీసుకున్న కాన్సెప్ట్ చిన్నదైన అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఆ విధంగా సరికొత్త కథల ఎంపిక చేస్తూ కొత్తదనాన్ని ఉట్టిపడేలా చూపిస్తూ సినిమాలు చేయడంలో సుహాస్ దిట్ట అని చెప్పవచ్చు. అలాంటి సుహాస్ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం గొర్రె పురాణం. ఈ చిత్రానికి బాబీ డైరెక్షన్ చేస్తున్నారు. అలాంటి ఈ సినిమా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.
అయితే టైలర్ చూస్తే మాత్రం పూర్తి కథ ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. ఓక గొర్రె కారణంగా ఒక ఊరిలోని రెండు మతాల మధ్య చిచ్చురేగుతుంది. అది కాస్త కోర్టు వరకు వెళుతుంది. అలా గొర్రెపై పెట్టిన కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది పూర్తి కథలో ఉంటుంది. కామెడీ ఎలిమెంట్స్ తో అద్భుతమైన పాయింట్స్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సుహాస్ ఖైదీగా కనిపిస్తారు.
అయితే మనం బ్రతకడానికి గొర్రెను తినేస్తాం, మరి గొర్రె బ్రతకడానికి మనల్ని చంపేస్తే ఎందుకు తన ఆత్మ రక్షణగా భావించకూడదు అంటూ డైలాగ్ అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ఈ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కతాంశంతో సుహాస్ సెప్టెంబర్ 20న గొర్రె పురాణంతో మన ముందుకు రాబోతున్నారు.
https://youtu.be/RHKO-JzvtZA?si=rr8W7al5wVEuVtI-