Jani Master: అసలు జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలేంటి ? ఎందుకు కేసు ?

జానీ మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 21 సంవత్సరాల వయసు ఉన్న శ్రేష్ఠ పోలీసులకు కంప్లైంట్ చేసింది.  


Published Sep 16, 2024 12:41:04 PM
postImages/2024-09-16/1726507508_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రెండు నేషనల్ అవార్డులు సాధించిన జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసు ను ఎదుర్కొంటున్నారు.జానీ మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 21 సంవత్సరాల వయసు ఉన్న శ్రేష్ఠ పోలీసులకు కంప్లైంట్ చేసింది.  


ఈ శ్రేష్ఠ ఢీ షో క్యాండిడేట్ కూడా . అక్కడ నుంచే వీరి పరిచయం జరిగింది. అక్కడ నుంచి జానీ మాస్టర్ తో పరిచయం పెరిగి  ..సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లేవారు. అయితే అలా వెళ్లినపుడు జానీ మాస్టర్ తన పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది శ్రేష్ట.. అవుట్ డోర్ షూట్ లోను ..క్యారవ్యాన్లలో కూడా తన పై అదే రకమైన లైంగిక వేధింపులు జరిగాయని తెలిపింది . శ్రేష్ఠ హైదరాబాద్‌ సిటీలోని నార్సింగికి చెందిన అమ్మాయి. అయితే ఈ వేధింపులు తన ఇంటిలో కూడా జరిగాయని ..బయటకు చెబితే ఇండస్ట్రీ లో ఎదగనివ్వనని బెదిరించే వాడని శ్రేష్ఠ తెలిపింది. 


జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన మహిళ నార్సింగి నివాసి అయినప్పటికీ... ఆమె ఫిర్యాదు ఇచ్చినది మాత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసింది. అయితే ఢీ 12 లో చేస్తున్నపుడు జానీ మాస్టర్  పరిచయం అయ్యింది. 2019 నుంచి జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ డాన్సర్ మాస్టర్ గా జాయిన్ అయ్యింది. అప్పటి నుంచే తనపై ఈ అత్యాచారాలు మొదలయ్యాయని ..అయితే ఎక్కడ జానీ మాస్టర్ ఎదగనివ్వరో అనే భయంతో బయటపడలేదని ..ఆమె ఆ జీరో ఎఫ్‌ఐఆర్‌ లో రాశారు.


జానీ మాస్టర్ ఓ ముస్లిం..శ్రేష్ఠ హిందూ ..తనని మతం మారి పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నట్లు ఈ ఎఫ్ ఐఆర్ లో మెన్షన్ చేశారు. అంతేకాదు తన భార్య కూడా మతం మారి తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు పోలీసుల వరకు వెళ్లిన కథ..శ్రేష్ఠ అనే అమ్మాయి చెప్పిన కథ ఇది. 


కాని జానీ మాస్టర్ ను దగ్గరగా చూస్తున్నవాళ్లు...ఇండస్ట్రీ వాళ్లు మాత్రం ఇదంతా జానీ మాస్టర్ ను తొక్కేయడానికి చేస్తున్న కుట్ర అంటున్నారు. ఈ మధ్య జానీ మాస్టర్ ఇండస్ట్రీ లోను ఇటు పొలిటికల్ గాను ఎదుగుతున్నారు. రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు , తమిళ్ లో బిజీ డాన్స్ మాస్టర్ గా ఉన్నారు. అందుకే ఈ స్కెచ్ వేశారని మరికొందరు అంటున్నారు.


ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఆయన మీద సతీష్ అనే మాస్టర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అతనే కొంతమంది లేడీ డాన్సర్లు జానీ మాస్టర్ వేధింపుల సంగతి చెబుతారని తెలిపాడు . కట్ చేస్తే సరిగ్గా నెలకు శ్రేష్ఠ కంప్లెయింట్ వచ్చింది. ఇదంతా నమ్మేది కాదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతానికి శేఖర్ మాస్టర్ ను పార్టీ వ్యవహారాల్లో కనిపించవచ్చదని జనసేన పార్టీ తెలిపింది. ఇటు ఇండస్ట్రీ లో తన పేరు ప్రఖ్యాతలు కూడా పోతున్నాయి. మరి జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటో చూడాలి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shrasti Verma (@vermashrasti)

 

newsline-whatsapp-channel
Tags : tollywood dhee-show rape johnmaster dance-master

Related Articles