BCCI:ఇంగ్లాండ్ క్రికెటర్ కు బీసీసీఐ షాక్ ..ఐపీఎల్ నుండి రెండేళ్ పాటు నిషేధం !

వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ లు ఆడటానికి అతను రాలేదు . దీంతో బ్రూక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


Published Mar 13, 2025 10:34:00 PM
postImages/2025-03-13/1741885543_harrybrook.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను ఐపీఎల్ నుండి రెండేళ్ల పాటు నిషేధించింది. ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ లు ఆడటానికి అతను రాలేదు . దీంతో బ్రూక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


బీసీసీఐ కొత్త నిబంధనలు ప్రకారం వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. సో హ్యారీ బ్రూక్ చాలా రోజుల నుంచి మ్యాచ్ లు ఆడటానికి రావడం లేదు. దీంతో ఈ నిషేధం విధించింది. బీసీసీఐ సమాచారాన్ని అందించిందని తెలుస్తోంది.


ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ ఇంగ్లాండ్ బ్యాటర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది తన అమ్మమ్మ మృతి చెందడంతో కుటుంబంతో ఉండటానికి ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news cricket-player

Related Articles