Kannappa:కన్నప్ప చిత్రంతో బాలనటుడిగా మంచు వారసుడు..పాత్ర అదుర్స్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు  హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్


Published Aug 26, 2024 05:05:08 PM
postImages/2024-08-26/1724672108_avarammanchu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు  హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన మోహన్ బాబు  తెలుగు ఇండస్ట్రీలోనే డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు.  ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అంతగా గుర్తింపు తెచ్చుకోవడం లేదని చెప్పవచ్చు.

https://x.com/themohanbabu/status/1827926509765427638?s=19

ఇప్పటికే సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అలాంటి మంచు విష్ణు హీరోగా  భారీ బడ్జెట్ తో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి  మంచు అభిమానుల్లో బజ్ పెరిగిపోయింది. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.  సినిమాలో చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు కీలకమైన నటులు కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

 అలాంటి ఈ మూవీలో మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు కూడా తెరంగేట్రం చేయబోతున్నారట. ఈ చిత్రంలో మంచు విష్ణు కుమారుడు అవ్రం కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు కృష్ణాష్టమి పురస్కరించుకొని, అవ్రామ్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే ఇందులో మంచు విష్ణు చిన్నప్పటి పాత్ర తిన్నడు క్యారెక్టర్ లో  ఈ మంచు వారసుడు నటించబోతున్నారట. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను  మోహన్ బాబు షేర్ చేసి అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manchu-lakshmi manchu-vishnu mohan-babu kannappa avaram thinnadu

Related Articles