movie review: రాజ్ తరుణ్ కు హిట్టు పడినట్టే ..భలే ఉన్నాడే మూవీ రివ్యూ !

ఈ సినిమా భలే ఉన్నాడే మాత్రం కూసింత థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్ జంటగా శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో సినిమా ఎలా ఉందో చూద్దాం. 


Published Sep 13, 2024 12:54:00 PM
postImages/2024-09-13/1726213258_setavuthundhaapairusong11718876026.jpg

నటినటులు:రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి తదితరులు


దర్శకత్వం:శివ సాయి వర్ధన్


నిర్మాత:కిరణ్ కుమార్


సంగీతం:శేఖర్ చంద్ర


సినిమాటోగ్రఫీ:నగేష్ బనెల్లా


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : రాజ్ తరుణ్ ఈ మధ్య సినిమాల్లో కంటే మీడియాలోనే ఎక్కువ కనిపిస్తున్నాడు. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కాని ..సార్ సినిమా ఈ రోజు థియేటర్లోకి వచ్చింది.  కొన్ని రోజుల క్రితమే తిరగబడరా సామీ,  పురుషోత్తముడు సినిమాలతో థియేటర్లలో సందడి చేశాడు. పెద్దగా ఆడలేదు కాని ఈ సినిమా భలే ఉన్నాడే మాత్రం కూసింత థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది. రాజ్ తరుణ్, మనీషా కందుకూర్ జంటగా శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో సినిమా ఎలా ఉందో చూద్దాం.  కథ లోకి వెళ్తే..


రాధ(రాజ్ తరుణ్) పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు శారీలు కడుతూ.. శారీ డ్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక అతడి తల్లి గౌరి(అభిరామి) బ్యాంక్ లో పనిచేస్తుంది. అదే బ్యాంక్ లో కృష్ణ(మనీషా కందుకూర్) జాయిన్ అవుతుంది. రాధ చేసే వంట నచ్చడంతో కృష్ణ, గౌరికి దగ్గర అవుతుంది. రాధను చూడకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది.అయితే డైరక్ట్ గా కాకుండా..వాళ్ల అమ్మ నుంచి పరిచయం అయ్యి ఎంగేజ్ మెంట్ చేసుకుంటారు. ఈ వేడుకలో కృష్ణ ఫ్రెండ్ వచ్చి తన భర్త సంసారానికి పనికి రాడని, అతడికి విడాకులు ఇస్తున్నట్లు, రాధ కూడా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు ఒకసారి ఆలోచించు అని కృష్ణకు చెబుతుంది. ఇక అక్కడ నుంచి కృష్ణ కు రాధ మీద అనుమానం వస్తుంది. ఓ ఆశ్రమానికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది ..రాధ గురించి ఏం తెలుసుకుందనేదే సినిమా.


డైరెక్టర్ శివ సాయి వర్థన్ తాను ఎంచుకున్న పాయింట్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఈ రోజుల్లో ఎలాంటి అలవాట్లు లేకుండా మంచిగా ఉండే అబ్బాయిలను అసలు వీడు అబ్బాయేనా? అని అనుమానంగా చూస్తున్నారు. డైరక్టర్ కి మంచి జనరల్ పాయింట్ దొరికింది . దీంతోనే చాలా బాగా ఫన్ క్రియేట్ చేశాడు. కొంచెం స్టోరీ అక్కడక్కడ బోర్ కొడుతుంది కాని ఓకే ఓకే . సింగీతం శ్రీనివాస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మదర్ సెంటిమెంట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రాజ్ తరుణ్ సైతం ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ తో ఆడియెన్స్ కు సర్ప్రైజ్ ఇస్తాడు. మొత్తానికి సినిమా భలే ఉన్నాడే అనిపిస్తుంది పక్కా.


ఎలా నటించారంటే..


తల్లిగా ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టేసింది. అతిథి పాత్రలో సింగీతం శ్రీనివాస్, లీలా శ్యాంసన్ అలరించారు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, సుదర్శన్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. మిగతా వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కెమెరా పనితం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ కొత్తగా, వినసొంపుగా ఉన్నాయి. డైరక్టర్ కు ఫస్ట్ సినిమా అయినా క్లీన్ గా నీట్ గా తీశాడు. సినిమా విషయానికి వస్తే రాజ్ తరుణ్ కు హిట్టు పడినట్టే. స్టోరీ చిన్నది కాస్త సాగదీసినట్లు ఉన్నా ..ఆడియన్స్ కి నవ్వులు మాత్రం బాగా పూయించారు. 

 

newsline-whatsapp-channel
Tags : movie-news rajtarun

Related Articles