Sruthi Haasan: విడాకులైన హీరోతో శృతిహాసన్ డేటిం**..?

హీరోయిన్ శృతిహాసన్ ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గానే శాంతాను హాజరికతో బ్రేకప్ చెప్పుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ 


Published Sep 13, 2024 04:25:56 PM
postImages/2024-09-13/1726224956_sruthi.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరోయిన్ శృతిహాసన్ ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గానే శాంతాను హాజరికతో బ్రేకప్ చెప్పుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో ప్రేమలో పడిపోయింది అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.మరి ఇంతకీ శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిపోయిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

శృతిహాసన్ ప్రేమలో పడిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా మొత్తం శృతిహాసన్ ప్రేమ వార్తలతో నిండిపోయాయి. అయితే ఈ హీరోయిన్ ప్రేమలో పడింది ఎవరో కాదు పెళ్ళై విడాకులు తీసుకున్న ధనుష్ అంటూ  కోలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే గతంలోనే ధనుష్ కి శృతిహాసన్ కి మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ వార్తలు వినిపించాయి.

అంతేకాదు శృతిహాసన్ ధనుష్ కాంబినేషన్లో వచ్చిన త్రీ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు అప్పుడప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా సమయంలో శృతిహాసన్ తో ధనుష్ డేటింగ్ చేశారనే వార్తలు కూడా మీడియాలో వైరల్ గా నిలిచాయి.కానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ధనుష్ భార్య ఐశ్వర్య ఈ విషయం తెలిసి శృతిహాసన్ కి వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు ఈ విషయంలో రజినీకాంత్ కూడా కలగజేసుకొని శృతిహాసన్ ని ధనుష్ కి దూరంగా ఉండమని చెప్పారట.

దాంతో శృతిహాసన్ అప్పటినుండి ధనుష్ కి దూరంగా ఉందట.అయితే త్రీ మూవీ తర్వాత మళ్లీ ధనుష్ తో నటించకపోయినప్పటికీ మునపటి ప్రేమను మాత్రం శృతిహాసన్ కి ఇంకా మైండ్ నుండి పోనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ధనుష్ ప్రస్తుతం విడాకులు తీసుకొని సింగిల్గానే ఉన్నారు.ఇక శృతిహాసన్ కూడా ఈ మధ్యనే బ్రేకప్ హార్ట్ తో చాలా సాడ్ గా ఉంది. ఈ సమయంలోనే వీరిద్దరు మళ్ళీ తమ మునపటి ప్రేమని కంటిన్యూ చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియా టాక్.. మరి శృతిహాసన్ మళ్ళీ ప్రేమలో పడిపోయింది అనే వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి

newsline-whatsapp-channel
Tags : rajinikanth newslinetelugu kollywood sruthi-haasan dhanush

Related Articles