రాధిక తన భర్తతో కలిసి హాస్పటిల్ లో దిగిన ఫొటోని షేర్ చేసి ..గత రెండు నెలలు చాలా బాధగా గడిచాయి. ఓ సినిమా షూటింగ్ లో నా మోకాలికి గాయం అయింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సీనియర్ యాక్టర్ రాధిక హీరోగా... క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం తాను మోకాలి నొప్పులతో బాధపడుతున్నట్టు ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తన మోకాలికి సర్జరీ అయిందని తెలుపుతూ నేడు ఉమెన్స్ డే రోజు ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
రాధిక తన భర్తతో కలిసి హాస్పటిల్ లో దిగిన ఫొటోని షేర్ చేసి ..గత రెండు నెలలు చాలా బాధగా గడిచాయి. ఓ సినిమా షూటింగ్ లో నా మోకాలికి గాయం అయింది. హాస్పటిల్ కి వెళ్తే సర్జరీ చెయాలని చెప్పారు. కాని నేను టాబ్లెట్స్ వాడాను. థెరపీలు చేయించుకున్నాను. మోకాలికి బ్రేస్ ధరించాను. ఆ నొప్పితోనే నేను సినిమా షూటింగ్స్ పూర్తి చేశాను. నా నొప్పి ఏ మాత్రం తగ్గకపోవడంతో చివరకు నేను సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ సమయంలో నా భర్త నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. ఈ ఉమెన్స్ డే రోజు ప్రతి స్త్రీ తన దృష్టి పెట్టాలని తనను తాను చాలా స్ట్రాంగ్ గా పనిపై దృష్టి పెట్టాలని , మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలని నేను కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది.