MAHESHBABU: నిర్మాతాలకు మహేష్ స్పెషల్ రిక్వస్ట్

ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతున్నాయి. కాని ఇప్పటి వరకు మూవీ అప్డేట్ లేదు. ఇలాంటి టైంలో మహేష్ బాబు ప్రొడ్యూసర్లకు ఓ స్మాల్ రిక్వస్ట్ చేశారట.


Published Sep 12, 2024 04:48:00 PM
postImages/2024-09-12/1726139947_Screenshot20240912164537.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ‘SSMB29’ మూవీ వస్తుందనే విషయం తెలిసిందే. ఇద్దరి కాంబో  లో సినిమా అనౌన్స్ చెయ్యగానే ...మహేష్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. అంటే నెక్స్ట్ పాన్ ఇండియన్ స్టార్ మహేష్ బాబు అని అనుకుంటేనే సూపర్ థ్రిల్ ఉందంటున్నారు.ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతున్నాయి. కాని ఇప్పటి వరకు మూవీ అప్డేట్ లేదు. ఇలాంటి టైంలో మహేష్ బాబు ప్రొడ్యూసర్లకు ఓ స్మాల్ రిక్వస్ట్ చేశారట.


ఏంటంటే మహేష్ తాను నటిస్తున్న SSMB29 మూవీ థియేటర్స్ లో విడుదలయ్యే వరకు.. ఇంత వరకు తాను నటించిన ఏ చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయుద్దని నిర్మతలను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు రీరిలీజ్ లు ట్రెండ్ కదా...రీ రిలీజ్ లు చెయ్యొద్దని ...రాజమౌళి, మహేష్ సినిమా అయిపోయాక రిలీజ్ చేసుకోవల్సిందిగా కోరాడు.


నిజానికి మహేష్ ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాలో నటించలేదు. అయితే SSMB29 మూవీతోనే బాలీవుడ్ వెండితెరపై తొలిసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పైగా రాజమౌళి దర్శకత్వంలో కాబట్టి, మహేష్ పాత సినిమాలు చూస్తే మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతుందనేది ఆయన అభిప్రాయంం. బాలీవుడ్ లో ఎక్కడ కూడా తన పాత సినిమాలు రిలీజ్ చేయకూడదని ముందు నుంచే మహేష్ జాగ్రత్తపడుతూ.. నిర్మాతలకు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ మాత్రం అడగొద్దు ..మూవీ టీం చాలా గట్టిగా సీక్రెట్ ప్లాన్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahesh-babu producer ss-rajamouli

Related Articles