JONY MASTER: నోరువిప్పిన జానీ మాస్టర్ ..శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ పేర్లు కూడా ప్రస్తావన!

మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటు కామెంట్ చేశారు.


Published Sep 17, 2024 03:03:00 PM
postImages/2024-09-17/1726565609_SexualharassmentcaseagainstJohnnyMaster.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జానీ మాస్టర్ పై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చూస్తుంది. తన పై వస్తున్న లైంగిక ఆరోపణలపై ఎట్టకేలకు జానీ మాస్టర్ పెదవి విప్పారు.మహిళా కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇంత వరకు అందరికి తెలిసిందే అయితే జానీ మాస్టర్ నోరు తెరచి మరో యాంగిల్ చెబుతున్నారు.యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అన్నారు. ఆధారాలు ఉంటే నన్ను శిక్షించించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటు కామెంట్ చేశారు.


తనకు డబ్బులు ఇచ్చి  నాపై కేసు పెట్టించారు. గతంలో ఆమె నా దగ్గర పని చేసింది. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. యూనియన్ మెంబర్స్ కి కాకుండా బయటనుంచి డాన్సర్స్ తో పనిచేయిస్తున్నారు. ఇలా చేస్తే తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ పీపుల్ కు ఉద్యోగాలుండవని వారించి వచ్చేశారు.కెమెరా మెన్ తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్స్ తో పని చేయించుకుంటే కార్డ్ ఉన్న మెంబర్స్ పని కోల్పోతా అన్నారు.


శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జోక్యం చేసుకోలేదు. బహుశా వాళ్ళు పనిలో బిజీగా ఉండొచ్చు. అంతా తెలిసే నోరు విప్పడం లేదన్నారు. నిజానికి ఈ ప్రశ్న అడిగిన తర్వాతే సాయంత్రానికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఆమె కు డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తున్నారు. చేయని నేరానికి 14 రోజులు రిమాండ్ చేసి వచ్చారు. దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని..ఆయన వల్లే ఇదంతా జరిగిందంటూ ఫైర్ అయ్యారు. ఇంత టాలెంటెడ్ మాస్టర్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం చాలా బాధాకరం అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : police dhee-show johnmaster

Related Articles