Big boss:సోహెల్ ఇంట తీవ్ర  విషాదం..ఏం జరిగిందంటే.?

బిగ్బాస్ షో ద్వారా ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తుల్లో సోహెల్ కూడా ఒకరు. ఈయన ఈ షోలోకి వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు.  అలాంటి సోహెల్ ఇంట్లో


Published Sep 17, 2024 06:57:29 PM
postImages/2024-09-17/1726579649_sohel.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్బాస్ షో ద్వారా ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తుల్లో సోహెల్ కూడా ఒకరు. ఈయన ఈ షోలోకి వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు.  అలాంటి సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లి ఫైమా సుల్తానా ఈరోజు మధ్యాహ్న సమయంలో హైదరాబాదులోని హైటెక్ సిటీ లోని మెడికోవర్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.

ఈమె గత కొంతకాలంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందట. డయాలసిస్ కోసం మెడికోవర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారట. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆమె కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సోహెల్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న సోహెల్ ఫ్రెండ్స్ కొంతమంది అక్కడికి వెళ్లి ఆయన ఓదారుస్తున్నారట. అయితే సోహెల్ స్వస్థలం కరీంనగర్ జిల్లా.

అయితే ఆమె మృతదేహాన్ని కరీంనగర్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోహెల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బూట్ కట్ బాలరాజు, మిస్టర్ ప్రెగ్నెంట్, లక్కీ లక్ష్మణ్ వంటి చిత్రాల్లో హీరోగా చేసి ఎంతో గుర్తింపు సాధించాడు. అలాంటి ఈ హీరో తల్లి మరణించడంతో ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు  సంతాపం తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line big-boss sohel mukku-avinash oraganik-mama-hybrid-alludu butcat-balaraju

Related Articles