Heart attack:గుండెపోటు వచ్చే ముందు చెవిలో ఇలా అవుతుందట.!

ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా  గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలకే  గుండె సంబంధిత వ్యాధులు వచ్చి మరణిస్తున్నారు. అలాంటి గుండె నొప్పి వచ్చే ముందు  కొన్ని


Published Sep 17, 2024 07:28:04 PM
postImages/2024-09-17/1726581484_newsline.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా  గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలకే  గుండె సంబంధిత వ్యాధులు వచ్చి మరణిస్తున్నారు. అలాంటి గుండె నొప్పి వచ్చే ముందు  కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. సాధారణంగా మనకు సంకేతాలలో చెమట పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, చాతిలో నొప్పి రావడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ గుండెపోటు వచ్చే ముందు  మరో సంకేతం కచ్చితంగా కనిపిస్తుందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 

 చెవిలో శబ్దం:
 గుండె సమస్యలు ఉన్నవారికి చెవిలో ఒక రకమైనటువంటి వినిపిస్తుందట. కరోటిడ్ ఆర్టరి  స్టెనోసిస్ అనే వ్యాధి కారణంగా  ఈ సంకేతం రావచ్చట. మెదడుకు రక్తాన్ని సరాఫరా చేసే పెద్ద రక్తనాళాలు  కరోటీడ్ ధమనులు  మూసుకుపోవడం వల్ల చెవిలో విచిత్రమైనటువంటి శబ్దం వినిపిస్తుందట. ముఖ్యంగా ధమనంలో కొలెస్ట్రాల్   పేరుకుపోవడం వల్ల ఇది సంభవిస్తుందని దీనివల్ల హాట్ స్ట్రోక్ వస్తుందని అంటున్నారు. 

 అజీర్తి :
 ముఖ్యంగా కడుపులో మంట, గుండెల్లో మంట, తేనుపులు, గుండె జబ్బుకు సంకేతం కావచ్చు. చాలామంది ఈ లక్షణాలను సీరియస్ గా తీసుకోకుండా సైలెంట్ గా ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మొత్తం తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించారట. గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలని అంటున్నారు. 

 ఛాతిలో దడ:
 కొన్నిసార్లు ఎలాంటి పనులు చేయకపోయినా కానీ ఆందోళన ఒత్తిడి  లేకపోయినా గుండె కొట్టుకునే వేగం క్రమంగా పెరుగుతూ దడ అనిపిస్తుందట. అలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heart-attack health-problems chlostrol ear-sound

Related Articles