సూర్యకు ఉన్న ఒక్క చెడ్డ అలవాటు వల్ల రోజు కొట్టుకుంటాం.!

టాలీవుడ్, కోలీవుడ్, ఇండస్ట్రీలో  ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి  భార్యాభర్తల్లో హీరోయిన్ జ్యోతిక హీరో సూర్య అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరూ సినిమాల్లో చేసే సమయంలోనే ప్రేమించుకుని ఆ


Published Sep 12, 2024 03:11:00 PM
postImages/2024-09-12/1726132679_surya.jpg

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్, కోలీవుడ్, ఇండస్ట్రీలో  ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి  భార్యాభర్తల్లో హీరోయిన్ జ్యోతిక హీరో సూర్య అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరూ సినిమాల్లో చేసే సమయంలోనే ప్రేమించుకుని ఆ తర్వాత 2006లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు దియా , దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన కొత్తలో జ్యోతిక  సినిమాలకు దూరమయ్యారు. అలా పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో ఆమె బిజీ యాక్టర్స్ గా మారారు.

అలా జ్యోతిక మరియు సూర్య జీవితం ఇండస్ట్రీలోనే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా చెప్పుకోవచ్చు. అలా ఎంతో అన్యోన్యంగా జీవించే ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య  తరచు కొట్లాట జరుగుతుందట. అది కూడా సూర్య చేసే చెడ్డ పనుల వల్లే ఇలా జరుగుతుందని రోజు కొట్టుకుంటామని  జ్యోతిక చెప్పుకొచ్చింది. అలా సూర్య జ్యోతిక 18 వ వార్షికోత్సవం సందర్భంగా  వారి మధ్య జరిగే గొడవ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకీ సూర్యలో ఆమెకు నచ్చని క్వాలిటీ ఏంటయ్యా అంటే  ప్రతిరోజు ఉదయాన్నే బాత్రూంలో చాలా సమయాన్ని గడుపుతాడు. నేను మళ్ళీ ఎంత పిలిచినా బయటకు రాడు. అలా ప్రతిరోజు మా ఇద్దరి మధ్య విపరీతమైన గొడవ జరుగుతుందని జ్యోతిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతిక  సితురై శివా డైరెక్షన్ లో రాబోతున్న ఖంగువా అనే చిత్రంలో నటిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood kollywood jyothika surya khanguva hero-karthi

Related Articles