jai hanuman : జై హనుమాన్ సినిమా ఆగిపోయిందా....అప్ డేట్ లేదు ఎందుకు ?

జనాలకు మతి పోతుంది. ప్రశాంత్ ఏం ప్లాన్ చేస్తున్నారు జై హనుమాన్ ప్లాన్ ఏంటి లాంటివి..సినిమా ఆగిపోయిందని కొందరు ...లేదు సినిమా చాలా లేట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. 


Published Sep 12, 2024 08:13:00 PM
postImages/2024-09-12/1726152460_27124brkprasanth.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హనుమాన్ అసలు ప్రశాంత్ వర్మ లైఫ్ నే మార్చేసింది. తేజ సజ్జా కు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. కథలో కంటెంట్ ఉంటే కనుక క్యాస్టింగ్ , బడ్జెట్ తో సంభందం లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. స్టార్ హీరోల సినిమాలకు పోటీ గట్టిగా ఇచ్చింది. పార్ట్ 2 జై హనుమాన్ గురించి జనాలు ఆరాలు తీస్తుంటే ప్రశాంత్ వర్మ మాత్రం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కూడా ప్రశాంత్ డైరెక్షన్ లోనే జరగనుందని కన్ఫర్మ్ అయింది. జనాలకు మతి పోతుంది. ప్రశాంత్ ఏం ప్లాన్ చేస్తున్నారు జై హనుమాన్ ప్లాన్ ఏంటి లాంటివి..సినిమా ఆగిపోయిందని కొందరు ...లేదు సినిమా చాలా లేట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. 


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రావాల్సింది జై హనుమాన్ సినిమానే.. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ టీం చాలా కష్టపడుతుంది. జై హనుమాన్ సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ అధీరా మూవీ రిలీజ్ చెయ్యనున్నారు. ఈ మూవీతో ప్రొడ్యూసర్ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ చేతిలో ప్రస్తుతానికి చాలా సినిమాలున్నాయి. అయితే జై హనుమాన్ కంటే ముందు మూడు సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ . ఆ తర్వాతే జై హనుమాన్ పై కాన్సంట్రేట్ చేస్తాడట.


హనుమాన్ తో మొదలైన ఈ దర్శకుడి సక్సెస్ జర్నీ ఇక ఆగేలా లేదనిపిస్తుంది. చాలా మంది ప్రొడ్యూసర్లు ప్రశాంత్ పై నమ్మకం పెట్టుకున్నారు. అయితే హనుమాన్ కోసం వెయిట్ చేసే వాళ్లు మాత్రం కనీసం మూడేళ్లయినా ఆగాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : mokshagna prashanth-varma hanuman

Related Articles