అప్లికేషన్ పూర్తి చేసేందుకు ఇదే చివరి తేదీ. తర్వాత లాస్ట్ డేట్స్ కాని ఎక్సెండ్ చెయ్యడం కాని ఉండదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.రైల్వేలో కొత్త రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల కోసం లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఆర్ఆర్‌సీ (RRC) సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) అప్రెంటిస్‌ల నియామకం కోసం దరఖాస్తులను కోరుతోంది. ఈ నియమకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయ్యింది. అఫీషియల్ వెబ్ సైట్ (secr.indianrailways.gov.in) లేదా (www.apprenticeshipindia.gov.in)లో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నియమకానికి అప్లికేషన్ ఫారాలు 25 మార్చి 2025 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అప్లికేషన్ పూర్తి చేసేందుకు ఇదే చివరి తేదీ. తర్వాత లాస్ట్ డేట్స్ కాని ఎక్సెండ్ చెయ్యడం కాని ఉండదు.
ఖాళీల వివరాలు :
ఈ రైల్వే అప్రెంటిస్ పోస్టుల్లో కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, స్టెనోగ్రాఫర్ హిందీతో సహా వివిధ ట్రేడ్‌లు ఉన్నాయి.
అర్హతలివే : ఈ రైల్వే అప్రెంటిస్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండటం తప్పనిసరి.
రైల్వే అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తుకు అభ్యర్థుల కనీస వయస్సు 15 ఏళ్లు, గరిష్ట వయస్సు 24 ఏళ్లు ఉండాలి.
జీతం (స్టయిపెండ్) : ఎంపికైన అభ్యర్థులకు నిర్ణీత స్టైపెండ్ చెల్లిస్తారు.
అప్రెంటిస్‌షిప్ వ్యవధి : ఒక ఏడాది, దీనికి ఫీజు ఏం లేదు. అంతేకాదు...అప్లికేషన్ తో పాటు మీ మార్కుల లిస్ట్ కాపీ ని అటాచ్ చెయ్యాలి.లేదంటే అప్లికేషన్ వాలిడ్ కానట్టే.