Samantha: కేరళ విద్యార్ధి మరణానికి ప్రభుత్వం చెప్పాల్సిందే !

మిహిర్ అనే   15 యేళ్ల బాలుడు ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కొందరు విద్యార్ధులు మిహిర్ తో టాయిలెట్ నాకించారు


Published Feb 01, 2025 09:03:00 PM
postImages/2025-02-01/1738424087_1200675234420281008234420281738321901587.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కేరళలో ఓ విద్యార్ధి ర్యాగింగ్ భూతానికి బలవ్వడం ప్రముఖ సినీ నటి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్నాకుళంలోని త్రిప్పునిథుర ప్రాంతంలో మిహిర్ అనే   15 యేళ్ల బాలుడు ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కొందరు విద్యార్ధులు మిహిర్ తో టాయిలెట్ నాకించారు. కమోడ్ లో అతని తలను ముంచి టాయిలెట్ నాకించడంతో మిహిర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తను ఉండే అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమంత స్పందించారు.


దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ర్యాగింగ్ ఇబ్బందులను బయటకు చెప్పడానికి విద్యార్థులు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని సమంత వ్యాఖ్యానించారు. విద్యార్ధులు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. బయపడకండి...పరిస్థితిని ధైర్యంగా పేరెంట్స్ తో ..ప్రిన్సిపల్ తో చెప్పండి. ఆత్మహత్య సరైన నిర్ణయం కాదని తెలిపారు.


"ర్యాగింగ్ కారణంగా విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం బాధాకరం. ఇలాంటి వాటికి సంతాపం కాదు వారికి న్యాయం జరిగే వరకు మనం వారికి తోడుగా ఉండాలి. మృతి చెందిన విద్యార్థికి న్యాయం జరగాలి. విద్యార్థులు ఇకనైనా ఇలాంటి వేధింపుల పట్ల ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలి. ర్యాగింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారికి అందరూ అండగా నిలవాలి" అని సమంత పిలుపునిచ్చారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha kerala sucide ragging

Related Articles