Priyanka Chopra: ఇండియా కు గుడ్ బై చెప్పేస్తున్న ప్రియాంకా..ఆస్తులు అమ్మేస్తుందా !


Published Mar 08, 2025 04:23:00 PM
postImages/2025-03-08/1741431262_123341200x720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. తర్వాత తర్వాత మెల్లగా బాలీవుడ్ ను వదిలి లాస్ ఏంజెల్స్ లో స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే మెల్లగా ముంబై లో ఇండియా లో ఉన్న ఆస్తులన్నీ ప్రియాంక అమ్మకానికి పెట్టేస్తుంది.ముంబయిలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్‌లో ప్రియాంకకు చెందిన నాలుగు ఫ్లాట్లను ఆమె ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించారు.


2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లు, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌస్‌లను ఆమె విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లో సొంత భవనాలు ఉన్నాయి.ఆమె హాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం సిటాడెల్ అమెరికన్ వెర్షన్ లో యాక్ట్ చేశారు. 


ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న #SSMB29 సినిమాలో ప్రతినాయక పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రీసెంట్ గా రాజమౌళి సినిమా షూట్ కూడా స్టార్ట్ అయ్యింది. తదుపరి షెడ్యూల్స్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాలు పూర్తి కావడానికి సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడి ఆస్తులు విక్రయించినప్పటికీ ప్రియాంక చోప్రా కొంతకాలం హైదరాబాద్‌లో ఉండవలసిన అవసరం ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : priyanka-chopra newslinetelugu bollywood- mumbai

Related Articles